భానూరు చేరుకున్న శాసనసభ్యులు
పటాన్‌చెరు : శాసనసభ స్థాయి సంఘాల సభ్యులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి నిర్వహించనున్న సదస్సుకు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సోమవారం రాత్రి మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం భానూరు గ్రామం లహరి రిసార్ట్స్‌కు తరలి వచ్చారు. ముందుగా ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలు వచ్చిన వారందరికీ పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. మొదటి బస్సులో శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో తరలి రాగా… ఆ తరవాత ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు అధికారిక వాహనాల్లో వచ్చారు.
అర్థవంతమైన చర్చలు .జరగడానికి శిక్షణ దోహదం..సీఎం : శిక్షణలో పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఆందరితో కలిసి భోజనం చేశారు. శాసనసభ వ్యవహారాలు సజావుగా సాగడానికి, ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగడానికి ఈ శిక్షణ దోహదపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో లహరి రిసార్ట్స్‌కు వచ్చిన ముఖ్యమంత్రి గంటసేపుమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉల్లసంగా గడిపారు.




