Saturday, 7 November 2026

ఈ నెల 30 న కాంగ్రెస్ పార్టీ రైతు పోరుబాట

ఈ నెల 30 న కాంగ్రెస్ పార్టీ రైతు పోరుబాట..
బేల, నవంబర్ 28 ( జనం సాక్షి ) రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల నెల 30న కాంగ్రెస్ పార్టీ అద్వర్యములో మండల కేంద్రములో రైతు పోరుబాట నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైజుల్లాఖాన్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ తో పాటు ధరణీ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.ఈ నిరసన కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్ తో పాటు ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ రాందాస్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సామ రుపేష్ రెడ్డి, సంజయ్ గుండావార్, విలాస్ పటేల్,మాడవి చంద్రకాంత్, శంకర్ భోక్రే తదితరులు పాల్గొన్నారు..