Thursday, 5 November 2026

ఈ- శ్రమ్ , మరియు భవన నిర్మాణ కార్మికులకు అవగాహన కల్పిస్తున్న : దేవరకొండ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ : ఏం నిష్మీత

 

అర్హులైన ప్రతి ఒక్క కార్మికుడు ఈ – శ్రమ్ కార్డులను ఉపయోగించుకోగలరు..

 

భవన నిర్మాణ కార్మికుల కోసం పూర్తి పారదర్శకంగా లేబర్ కార్యాలయం పనిచేస్తుంది

కార్మికులను మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

కార్మికులు తమ దరఖాస్తులను ఆన్లైన్లోనే అప్లై చేసుకోవలెను…

కార్యాలయంలో దరఖాస్తులకు ఎటువంటి రుసుము చెల్లించ నవసరం లేదు.…

 

కొండమల్లేపల్లి జనవరి 20 జనం సాక్షి న్యూస్ :

దేవరకొండ పట్టణంలోని స్థానిక తాపీ మేస్త్రి సంఘం అడ్డాలో దేవరకొండ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఏం.నిష్మిత శుక్రవారం రోజు భవన నిర్మాణ కార్మికులకు, మరియు ఇతర కార్మికులకు ఈ శ్రమ్ కార్డులపై, మరియు భవన నిర్మాణ లేబర్ కార్డులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు… ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. ప్రతి ఒక్క కార్మికుడు తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ అందించె ఈ శ్రాం కార్డులను, లేబర్ కార్డులను వినియోగించుకోవాలని అన్నారు.
భవన కార్మికుల శ్రేయస్సు ముఖ్యమని అలాగే . ఇటీవల కాలంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు వర్తించాల్సినటువంటి ఇన్సూరెన్స్ లు , ఇతర వాటిపై కొందరు బయట వ్యక్తులు పనులు చేపిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారని అలాంటి వారి పట్ల భవన నిర్మాణ కార్మికులు జాగ్రత్తగా ఉండాలని ఆమె తెలిపారు.. భవన నిర్మాణ కార్మికులు వారికి పొందే ఇన్సూరెన్స్ దరఖాస్తులను ఆన్లైన్లో నె దరఖాస్తు చేసుకోవాలని అది కేవలం మాన్యువల్ కాకుండా మీ సేవలో దరఖాస్తు చేసి నేరుగా లేబర్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బందికి మాత్రమే అందించాలని ఆమె తెలిపారు. కార్యాలయ సిబ్బందికి అట్టి దరఖాస్తులు అందజేసే విషయంలో ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు . ఇలాంటి దరఖాస్తులు అన్నీ కూడా కార్యాలయ సిబ్బంది కాకుండా బయటి వ్యక్తులకు అందజేస్తే అలాంటి దరఖాస్తుల విషయంలో కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు .రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం వారికి రావలసినటువంటి ఇన్సూరెన్స్ ఇతర లబ్ధి చేకూరే పథకాలను పూర్తి పారదర్శకంగా పనిచేస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తాపీ సంఘం అధ్యక్షులు , పెయింటింగ్ సంఘం అధ్యక్షులు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు…
ఇంకా మరిన్ని వివరాల కోసం .. ఈ నెంబర్ 9492555334 కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవాలని ఆమె తెలియజేశారు.