దేశ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో బలమైన శక్తిగా గులాబీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
కొండమల్లేపల్లి జనవరి 20 జనం సాక్షి న్యూస్ :
చరిత్రను తిరగరాయనున్న బీఆర్ఎస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.శుక్రవారం దేవరకొండ మండలం మర్రిచెట్టు తండాలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్,దేశంలో ఒక గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం జరిగింది అని ఆయన అన్నారు. ఆనాడు ఎలాగైతే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంథాను అనుసరించారో..అలాగే ఈనాడు దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని కేసీఆర్ ప్రారంభించడం జరిగింది అని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలు బీఆర్ఎస్ వేదికగా దేశం మొత్తానికి అమలు చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని సర్వేలు చెప్తున్నాయని దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే చర్చలు జరిపారని అనేక మంది హేమాహేమీ నేతలు సీఎం కేసీఆర్ ఆలోచనలతో ఏకీభవించారని,కలిసివచ్చేందుకు ఆసక్తిచూపుతున్నారని దేశంలో రాబోయే రోజుల్లో గుణాత్మక మార్పుకు బీఆర్ఎస్ నాంది పలుకుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్,రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నేనావత్ శ్రీను,వాడిత్య డిప్ల,మునికుంట్ల వెంకట్ రెడ్డి,బోడ్డుపల్లి కృష్ణ,బావోజి,వాజిద్ పాషా,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.
చరిత్రను తిరగరాయనున్న బీఆర్ఎస్ పార్టీ




