Tuesday, 3 November 2026

‘ఉచిత కరెంట్‌ బాబు అసాధ్యమన్నారు’

హైదరాబాద్‌ : గతంలో ఉచిత విద్యుత్‌ అడిగితే అసాధ్యమన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. పెంచిన ఛార్జీలు తగ్గించమంటే కాల్పుటు జరిపించారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కరెంట్‌ ఛార్జీలు పైసా పెరగకుండా వైఎస్‌ఆర్‌ పాలించారని శోభా నాగిరెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను వైఎస్‌సాధ్యం చేసి చూపారన్నారు. విద్యుత్‌ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాకే టీడీపీ దీక్షలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *