ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ ఏరుకొండ ఇందిరా సుధీర్

 

జనం సాక్షీ సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో తెలంగాణ కార్మిక శాఖ కింద నమోదు కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా అట్టి ఆరోగ్య శిబిరాన్ని ఏరుకొండ ఇందిర సుధీర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు, రేపు కూడా వైద్య పరీక్షలు చేస్తారు ఇప్పటికీ ఎవరైనా కార్మికులు లేబర్ ఇన్సూరెన్స్ చేసుకోనట్లయితే తప్పకుండా చేసుకోగలరని చెప్పారు. పేద కార్మికుల కోసం ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందిస్తుందని అలాగే కార్మికుల కోసం ప్రమాద భీమా, ఆరోగ్య భీమా, కల్యాణలక్ష్మి అందిస్తుంది వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను అన్ని విధాల ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నేను బొమ్మకల్ ప్రజలకు గతంలో సర్పంచిగా, ప్రస్తుతం ఎంపీటీసీగా ఉండి గ్రామానికి అనేక సేవలు చేశాను. అలాగే మునుముందు కూడా స్థానికంగా ఉంటూ ప్రజల అవసరాల నిమిత్తం ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను సక్రమంగా ప్రజలకు అందే విధంగా చేయగలని అన్నారు

తాజావార్తలు