ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి దయానందరాణి అన్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్ఐ, పీసీ ప్రిలిమనరీ పరీక్షలో అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు సూర్యాపేట పోలీస్ శాఖ పర్యవేక్షణలో ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు.ఈ కోచింగ్ లో భాగంగా ఫిజికల్ ట్రైనింగ్ తో పాటు మెయిన్ ఎగ్జామ్ కు సంబంధించిన క్లాసులు చెప్పనున్నట్లు తెలిపారు.అభ్యర్థులకు రూ.1000 విలువ గల స్టడీ మెటీరియల్ తో పాటు ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్, సూర్యాపేట డైరెక్టర్ చిట్టిపాక రాములు తదితరులు పాల్గొన్నారు.




