Saturday, 7 November 2026

విద్య ద్వారానే జ్ఞానం వర్ధిలుతుంది

విద్య ద్వారానే జ్ఞానం వర్ధిలుతుంది

బిఎస్పీ మండలం కన్వీనర్ తిరుపాల్
ఇటిక్యాల (జనంసాక్షి) నవంబర్ 28
విద్య లేనిదే వివేకం లేదని, విద్య ద్వారానే వివేకం విజ్ఞాన వర్ధిల్లుతుందని, దేశ ప్రజలకు విద్యను నేర్పించిన మొదటి గురువు మహాత్మ జ్యోతిబాపూలే అని బహుజన సమాజ్ పార్టీ ఇటిక్యాల మండల కన్వీనర్ తిరుపాల్ అన్నారు. సోమవారం మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి వేడుకలను ఇటిక్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈసందర్బంగా తిరుపాల్ మాట్లాడుతూ దేశంలోని ప్రజలకు విద్యను నేర్పించడం మాత్రమే కాక తాను రాసిన గులాంగిరి పుస్తకం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప మేధావి మహాత్మా జ్యోతిరావు పూలే అని సేవలను కొనియాడారు. ప్రజలు చైతన్యవంతం కావాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కానీ నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్వీర్యం చేస్తూనయన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ పార్టీ నాయకులు ధర్మవరం రాముడు, ఆకేపోగు రాంబాబు, విద్యాసాగర్, భాస్కర్, దావీదు,జాన్, యేసు రాజు, హనుమంతు, పెంటన్న, భాస్కర్, సామేలు, జాన్సన్,రవి, గోపి మరియు ఇతరులు ఉన్నారు.