సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): సూర్యాపేట మున్సిపాలిటీ 45వ వార్డులోని గండూరి జానకమ్మ ఉచిత వాటర్ ప్లాంట్ వద్ద ఈ నెల 12న నిర్వహించనున్న ఉచిత షుగర్, కొలెస్ట్రాల్ టెస్ట్ క్యాంప్ ను వార్డ్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆ వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కోరారు.లయన్స్ క్లబ్ జూనియర్ ఛాంబర్ – సూర్యాపేట, పద్మశాలి యువజన సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ వారి సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల 37 , 42వ వార్డుల్లో ఉచిత షుగర్, కొలెస్ట్రాల్ టెస్ట్ క్యాంప్ ను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.నిర్వహించిన రెండు చోట్ల ఉదయం 7 గంటల నుండే ప్రజలు పెద్దసంఖ్యలో రక్త పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు.ఈ నెల 12న ఆదివారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జిల్లా నాయకులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.45వ వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు




