Wednesday, 4 November 2026

పెనుబల్లి లొ ఎమ్మెల్యే సండ్ర పరామర్శ

 

 

 

 

 

 

పెనుబల్లి, ఫిబ్రవరి 11(జనం సాక్షి)మండల పరిధిలోని పెనుబల్లి, వి ఎం బంజర్ గ్రామాలలో శనివారం సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య పలు కుటుంబాలను పరామర్శిం చారు,మల్లెల మారేశ్వరరావు ఇటీవల మరణించగా ఆయన చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పిం చారు,వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. గ్రామానికి చెందిన మల్లెల కృష్ణ తల్లి అనారోగ్యంతో మరణించగా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. వి యం బంజ ర్ కు చెందిన వనమా సాంబశివరావు రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆయన చిత్రపటానికిపూలమాలవేసి నివాళులర్పించారు. సండ్ర వెంట జెడ్ పి టి సి చెక్కిలాల మోహనరావు, సర్పంచ్ తావు నాయక్, మల్లెల సతీష్, వంగా నిరంజన్, బెజవాడ కోటిస్వామి, మల్లెల శ్రీనివాసరావు, పొట్లపల్లి నాగప్రసాద్ తదితరులు ఉన్నారు.