Thursday, 5 November 2026

ఉత్తమ్‌ వ్యాఖ్యలు అర్థరహితం: జగదీశ్‌ రెడ్డి

హైదరాబాద్‌,మార్చి9 : తాజాగా టీపీసీసీ చీఫ్‌ గా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై మంత్రి జగదీష్‌ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను విమర్శించే స్థాయి ఉత్తమ్‌ కు లేదని మంత్రి తెలిపారు. సోమవారం విూడియాతో మాట్లాడిన మంత్రి.. సొంత పార్టీ నేతలే ఉత్తమ్‌ ను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. అంతర్గతం కుమ్ములాటలతో సతమతమవుతున్న పార్టీని కాపాడుకోలేక తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. సభా గౌరవాలను అగౌరపరిచినందుకు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశామని మంత్రి తెలిపారు. జై తెలంగాణ అనని ఉత్తమ్‌ ను టీపీసీసీ చీఫ్‌ గా ఎలా నియమించారని సొంతపార్టీ నేతల ప్రశ్నిస్తున్నారని జగదీష్‌ రెడ్డి చురకలంటించారు. సీఎం కేసీఆర్‌పై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మంత్రి  మండిపడ్డారు. పార్టీ అంతర్గత కలహాల నుంచి బయటపడటానికి సీఎంపై నిందారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ఉత్తర కుమారుడేనని తేలిపోయిందన్నారు. అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ఆయన నియామకమే ఒక ప్రహాసనంగా మారిందని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ నేతలే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియామకాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హతలేని ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. సభ నుంచి ఇవాళ టీడీపీని సస్పెండ్‌ చేయాలని కోరిందే కాంగ్రెస్‌ పార్టీ అని తెలిపారు. ఇప్పుడు అదేదో తప్పు అన్నట్టుగా మాట్లాడటం సరికాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *