Wednesday, 4 November 2026

ఉత్తమ ఆరోగ్య గ్రామంగా కల్వచర్ల ఎంపిక

జనం సాక్షి , రామగిరి: పెద్దపల్లి జిల్లాలోని జిల్లా స్థాయిలో నిర్వహించిన 9 విభాగాల్లో మండలంలోని కల్వచర్ల గ్రామ పంచాయతి ఆరోగ్య గ్రామం గా ఎంపికైంది. నేడు మండల పరిషత్ కార్యాలయం అవరణలో ఎంపిపి అరెళ్ళి దేవక్క కొమురయ్య గౌడ్, జెడ్పీటిసి శారద కుమార్ యాదవ్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి కి అందజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ.. అవార్డ్ కి ఎంపిక అవడం పట్ల సంతృప్తిగా ఉన్నామని, భవిష్యత్తులో గ్రామాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపెలా కృషి చేస్తానని పేర్కొన్నారు. కల్వచర్ల గ్రామ పంచాయతి ఆరోగ్య గ్రామంగా అవార్డుకు ఎంపికవ్వడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.