జనంసాక్షి , కమాన్ పూర్ : కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన, జూలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ముల్కలపల్లి గ్రామానికి చెందిన గుంజపడుగు గంగ, తాటిశెట్టి దేవేంద్ర, ఒడ్డెపల్లి దుర్గమ్మ లు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కి సిఫారసు చేసుకోగా తాటిశెట్టి దేవేంద్ర కు 32.000/- రూ, గుంజపడుగు గంగ కు 24.000/- రూ, ఒడ్డెపల్లి దుర్గమ్మకు 9.000/- రూ మంజూరయ్యాయి. మంజూరైన ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు శుక్రవారం లబ్ధిదారులకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, బీఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండల అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, జూలపల్లి సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్, మండల కో ఆప్షన్ మెంబర్ ఎండీ. ఇంతియాజ్, జూలపల్లి ఉప సర్పంచ్ పోల్దాసరి సాయికుమార్, కమాన్ పూర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నీల రాజయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, గడప కృష్ణమూర్తి, దండే రమేష్ ఠాగూర్, పిడుగు అంజి, బంగారు గట్టయ్య, కమ్మగోని అనిల్, గోస్కి వరప్రసాద్, రాజ్ కుమార్, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత




