ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించిన ప్రజా ప్రతినిధులు
పినపాక నియోజకవర్గం ఆగస్టు 17 (జనం సాక్షి): స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మణుగూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కోట వీరబాబు ,ఎంపీ ఓ పల్నాటి వెంకటేశ్వరరావు కు ఆగస్టు 15న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా పాలనాధికారి దురిశెట్టీ అనుదీప్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జడ్పిటిసి పోశం నరసింహ రావు సారధ్యంలో ఉత్తమ అవార్డు పొందిన గ్రహీతలను సన్మానించి శాలువతో ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ మణుగూరు మండల పరిషత్ అధికారులకి ఉత్తమ ఉద్యోగుల అవార్డులు పొందటం మణుగూరుకే గర్వకారణం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు ,డంపింగ్ యార్డులు వీళ్ళ సారథ్యంలో ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి పల్లెకు కావలసిన మౌలిక సౌకర్యాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందారు. సన్మాన కార్యక్రమంలో ఎంపీటీసీలు గాజుల రమ్య కనితి బాబురావు సమ్మక్క స్థానిక సర్పంచులు ఏనిక ప్రసాద్ బచ్చల భారతి పాల్వంచ ఈశ్వరమ్మ బొగ్గం రజిత జంపేశ్వరీ కారం ముత్తయ్య కాయం తిరుపతమ్మ కురసం రాంబాబు తాటి రామకృష్ణ ప్రాథమిక పరపతి సంఘం అధ్యక్షులు కురి నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు తదితరులు పాల్గొన్నారు.