Thursday, 5 November 2026

ఉత్తమ కవిగా ప్రశంసా పత్రం పొందిన బిజెపి సీనియర్ నాయకులు మండికారి బాలాజీ

 

 

 

 

 

 

 

 

 

అచ్చంపేట ఆర్సి ,17 ఏప్రిల్ 2023 ,జనం సాక్షి న్యూస్ : పట్టణానికి చెందిన బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మండికారి బాలాజీ ఉత్తమ కవితా  రచన ‘ఇదేరా నా దేశ గౌరవం’ అనే జాతీయ భావ అంశం పైన తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కవితా సమ్మేళనంలో  ఉత్తమ కవిత రచన అందించినందుకు అభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు . ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ..మండికారి బాలాజీ  చిత్రకారుడుగా, కవి, రచయితగా విశేష ప్రతిభను కనబరుస్తూ పలు స్వచ్ఛంద, సాంస్కృతిక, ప్రభుత్వ వేదికల  నుండి అవార్డులు ప్రశంసా పత్రాలు స్వీకరించడం అభినందనీయమని కొనియాడారు .కార్యక్రమంలో ఎస్ వి ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి, ప్రధాన సహాయకులు కీలపర్తి నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మీసాల చిన్న గౌరీ నాయుడు ,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పైడి నవనీత రవిచందర్, జాతీయ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణరావు, శ్రీమతి డాక్టర్ బి హెచ్ వి రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.