బూర్గంపహాడ్ ఏప్రిల్ 17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ మండల పరిధిలో గుడిశెట్టి వారి పుష్పాలంకరణ వేడుకలో మాజీ జెడ్ పి టి సి బట్టా విజయ్ గాంధీ పాల్గొన్నారు. యాదవ బజార్ నందు గుడిశెట్టి నరేష్-మణి దంపతుల ఏకైక పుత్రిక హారిక పుష్పాలంకరణ వేడుక సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ సభ్యులు బట్టా విజయ్ గాంధీ మరియు మండల కాంగ్రెస్ యూత్ బృందం పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ యువనాయకులు ప్రముఖ న్యాయవాది భజన సతీష్ కుమార్, గుండె వెంకన్న, భజన ప్రసాద్, యువజన నాయకులు శెనగా కిషోర్, కన్నెబొయిన సారధి, చిర్రా నాని, జాన్ రాజు, నాగేశ్వరరావు, సునీల్, భద్ర, రవి తదితరులు పాల్గొన్నారు.




