మల్దకల్ మార్చి 24 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని 17ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక చేసింది.శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన ఉత్తమ గ్రామ పంచాయతీల జాతీయ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ వై రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ 17 గ్రామపంచాయతీలు జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.వివిధ కార్యక్రమాలలో విశేష కృషిచేసి సేవలందించి అవార్డు పొందిన సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు అభినందించి సన్మానించారు. పల్లెలు పారిశుద్ధ్య స్వచ్ఛత అభివృద్ధి తదితర అంశాలలో దక్కించుకున్న అవార్డులతో గ్రామపంచాయతీలు మురిసిపోయాయి.పల్లె ప్రాంతాలు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు.ఉత్తమ గ్రామపంచాయతీల అవార్డులు పొందిన సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు శాలువా,మేమెంటో ఘనంగా సత్కరించారు.వచ్చే సంవత్సరం కూడా కొన్ని గ్రామపంచాయతీలను జాతీయస్థాయి అవార్డులు రావడానికి కృషి చేయాలన్నారు.కొన్ని గ్రామాలకు అవార్డులు రాకపోవడంతో బాధ పడే అవసరం లేదని గ్రామాలు అభివృద్ధి చేస్తే గుర్తింపు చిరస్థాయిగా ఉంటుందన్నారు. తాటికుంట,మల్లెందొడ్డి,పెద్దొడ్ డి, నీల్లిపల్లి ఏల్కూరు, పావనంపల్లి,చర్లగార్లపాడు, దాసరపల్లి గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులకు చోటు దక్కలేదు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న,సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి,ఎంపీడీవో కృష్ణయ్య,ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి,సీనియర్ అసిస్టెంట్ సూర్య ప్రకాశ్ రెడ్డి,మండల సర్పంచ్ల సంఘము అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి,కో ఆప్షన్ నెంబర్ హైదర్, అంగన్వాడి సూపర్వైజర్ నాగరాణి,గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.




