మునిపల్లి, మార్చ్ 24, జనంసాక్షి : మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వశక్తి కిరణ్ పురస్కారలు రావడం అభినందనీయమని ఎంపీపీ శైలజ , జడ్పీటీసీ పైతరమీనాక్షిలు అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం మండల కేంద్రమైన మునిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ స్థాయి అవార్డులు దక్కడం గ్రామ పంచాయతీ సర్పంచ్, సెక్రటరీ, సభ్యులు చేస్తున్న పనికి నిదర్శనమన్నారు. ఇదే ఉత్సాహంతో పనిచేసి గ్రామ ప్రజల మన్నలను పొందాలన్నారు. ఆవార్డులు దక్కించుకున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు సన్మానించారు. ఇందులో భాగంగానే మండల వ్యాప్తంగా 30 గ్రామ పంచాయతీలకు గాను 26 గ్రామ పంచాయతీలకు అవార్డులు రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అంజనీదేవి, ఎంపీఓ అండాలమ్మ , ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




