Tuesday, 3 November 2026

ఉత్తమ జర్నలిస్టుకు ఘన సన్మానంఉత్తమ జర్నలిస్టుకు ఘన సన్మానం

 

 

 

 

 

ఖానాపూర్ జనవరి 30(జనంసాక్షి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్,జెడ్పీ చైర్మన్ ల చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్టుగా ప్రశంసా పత్రం అందుకున్న సీనియర్ పాత్రికేయులు గుమ్ముల అశోక్  సోమవారం ఖానాపూర్ వచ్చిన సందర్భంగా ప్రెస్ భవన్ లో పలువురు జర్నలిస్టులు సన్మానించారు. గత  20 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ ఎన్నో పరిశోధన కథనాలు అందించిన అశోక్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుకి,జిల్లా ప్రజాపరిషత్  చైర్మన్ కె విజయలక్ష్మి  చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకోవడం అభినందనీయం అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని జర్నలిస్టులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పుప్పాల శేఖర్, గాండ్ల రాజశేఖర్,సిరిపురం నాగరాజు, అసూరి సంతోష్, మొగిలి నర్సయ్య,తుమ్మనపల్లీ సంకేత్, కతులపురం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.