Tuesday, 3 November 2026

గాంధీ అడుగు జాడల్లో నడవాలి

 

 

 

 

 

 

:జైపాల్ రెడ్డి : శామీర్ పేట్, జనం సాక్షి :
జాతిపిత,బాపూజీ మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవర యాంజాల్,హకీంపేట్ లోని మహాత్మా గాంధీ విగ్రహాలకు పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన బాటలోనే మనందరం పయనించాలని,అహింస,సత్యము, ధర్మము,స్నేహం వీటి ద్వారానే దేశంలో శాంతి చేకూరుతుందని, అహింస ద్వారా ఏదైనా సాధించవచ్చని దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చి మహాత్మా గాంధీ గారు నిరూపించారని,అందుకే మనందరికీ ఆయన జాతిపిత అయ్యారని, ఆయన చూపిన బాటలోనే పయనించి దేశాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువచ్చి,అన్ని రంగాలలో భారత దేశాన్ని ప్రపంచ దేశాల ముందు అగ్రగామిగా నిలపడంలో మనందరం కృషి చేయ్యా లని,ముఖ్యంగా యువత దేశం పట్ల ప్రేమ భావంతో, బాధ్యతతో ఉండాలని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే దాంట్లో యువతే ముఖ్య భూమిక వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దళిత సమైక్య అధ్యక్షులు బియన్ రామ్మోహన్,రామాలయం మాజీ ధర్మకర్త పట్నం నర్సింహా రెడ్డి,మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వజ్జల శేశాంత్(బన్నీ) తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కందాల రాము, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ యసి సెల్ ప్రధాన కార్యదర్శి బాల్ రాజు,హకీంపేట్ 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్,ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్,కార్యదర్శి పాండు,తదితరులు పాల్గొన్నారు.
30ఎస్పీటీ -2: నివాళులు అర్పిస్తున్న నాయకులు