ఉత్తమ లైబ్రరీ అధికారిగా ఎన్నికైన జోగులాంబ గద్వాల జిల్లా లైబ్రేరియన్ ను సన్మానించిన ఎమ్మెల్యే
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 13 (జనం సాక్షి);జాతీయ గ్రంధపాలకు దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర లైబ్రేరియన్ ను ఎంపిక చేసింది అందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా గ్రంధాలయం లైబ్రేరియన్ కె .రామాంజనేయులు ఎంపిక రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారము గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ లైబ్రేరియన్ రామాంజనేయులు ని శాలువా కప్పి మిఠాయి తినిపించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జెడ్పిటిసి రాజశేఖర్, గద్వాల టౌన్ పార్టీ యూత్ అధ్యక్షుడు గంజి పేట మధు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు అజయ్, వెంకటేశ్వర రెడ్డి, భగీరథ వంశీ, శేఖర్, కురుమన్న, మోబిన్ , బద్రి, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.