Sunday, 8 November 2026

ఉత్తమ సేవలకు ప్రశంస పత్రం

ఉత్తమ సేవలకు ప్రశంస పత్రం

కోటగిరి డిసెంబర్ 22 జనం సాక్షి:-నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని కోటగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సురేష్ కు సిపి నాగరాజు గురువారం ఉత్తమ ప్రశంస పత్రాన్ని అందజేశారు.ప్రజలతో మమేకమవుతూ విధులలో తన యొక్క గుడ్ వర్క్ ను చూపించి ప్రతినెల గుడ్ వర్క్ చేసిన కానిస్టేబుల్ లకు ప్రశంసా పత్రాని అందజేసే కార్యక్రమంలో భాగంగా నవంబర్ నెలకు గాను నిజామాబాద్ జిల్లా లో బెస్ట్ పెట్రో కార్ విధులు నిర్వహించిన కానిస్టేబుల్ సురేష్ ఈ ప్రశంసా పత్రం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సురేష్ మాట్లాడుతూ మా సేవలను గుర్తించి ప్రశంస పత్రాన్ని అందించిన ఉన్నత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు