Wednesday, 4 November 2026

ఉత్తరఖండ్‌లో భారీ వర్షాలు-10మంది మృతి

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌లోని భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలవల్ల పది మంది మృతి చెందారు. మరో 53 మంది ఆచూకీ తెలియటంలేదు. ఉత్తరకాశీలోని రెండుచోట్ల, చమోలీ జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇళ్లు కొట్టుకు పోవటంతో స్థానికులే కాక యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. గంగ,భాగీరధి నదుల్లో నీటిమట్టం పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా నదుల తీరప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. సీఎం విజయ్‌ బహుగుణ సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చార్‌ధామ్‌ యాత్రను కూడా వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *