హైదరాబాద్ : ఉత్తఆరఖండ్ తరహా విపత్తులు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా తలెత్తే ప్రమాదం ఉందని ప్రముఖ సామాజికవేత్త, నీటి ఉద్యమ కారుడు రాజేంద్రసింగ్ హెచ్చరించారు. కార్పోరేట్, ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వాలు గులాంగిరి చేస్తున్నంతకాలం ఇలాంటి విపత్తులు తలెత్తుతూనే ఉంటాయని ఆయన హైదరాబాద్‌లో అన్నారు. ఉత్తరాఖండ్ ఘటన జరిగేందుకు కార్పొరేట్, ప్రైవేటు కంపెనీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సమాజం ప్రధాన కారకులని అభిప్రాయపడ్డారు. హిమాలయాలను రక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలని లేకుంటే మరిన్ని విపత్తులను చవిచూడాల్సి ఉంటుందన్నారు. అభివృద్ధి పేరుతో పర్యావరణం, నదులు, అడవులను నాశనం చేస్తున్నారని, జరుగుతున్న విధ్వంసాలన్నింటికీ మానవ తప్పిదాలే కారణమన్నారు.




