హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ బాధితుల కోసం రాష్ట్ర పోలీసు శాఖ రూ.2 కోట్ల విరాళాన్ని డీజీపీ దినేష్‌రెడ్డి చేతుల మీదుగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసింది. ముఖ్యమంత్రి ఈ రోజు లక్‌డీకాపూర్‌లో కొత్తగా నిర్మించిన సీఐడీ భవనాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చిన వాహనాలను కూడా ఆయన ప్రారంభించారు.




