హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ వరదబాధితుల సహాయ చర్యలపై ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బంది, నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రంలోగా రాష్ట్ర వాసులందరినీ వారి స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని ఆయన వారిని ఆదేశించారు. అవసరమైతే మరోమారు ప్రత్యేక హెలికాప్టర్లు ఏర్పాటు చేయాలని ట్రస్టు సిబ్బందిని ఆదేశించారు.




