హైదరాబాద్, సెప్టెంబరు 18 : విదర్భ, చత్తీస్‌ఘడ్‌ను ఆనుకొని తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం ప్రభావంతో చత్తీస్‌ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తర తెలంగాణాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖలోని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.




