Monday, 2 November 2026

ఉదయం ఎండలు.. సాయంత్రం వర్షాలు

నాలుగు రోజులు మోస్తరు వర్షాలు
– వచ్చే నెలలో తీవ్ర వడగాడ్పులు
– హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక
– ‘వేసవి ప్రణాళిక’ చేపట్టాలని విపత్తు నిర్వహణ శాఖకు సూచన

, హైదరాబాద్‌: విదర్భ, మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని శుక్రవారం హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం వరకు యథావిధిగా ఎండలు.. సాయంత్రం మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మేఘాలు ఆవరించి ఉన్నా ఉక్కపోతగా ఉంటుందని పేర్కొంది. కాగా, శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, రామగుండంలలో 43 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వచ్చే నెలలో తీవ్ర వడగాల్పులు..
వచ్చే నెల వడగాడ్పుల తీవ్రత మరింత ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. మే నెలలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 47 డిగ్రీలకు చేరుతాయని స్పష్టం చేసింది. దీంతో వడగాడ్పులు తీవ్రంగా వీస్తాయని తెలిపింది. విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది. సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా అంటే వడగాడ్పులుగా లెక్కిస్తారు. 6 డిగ్రీలు అధికంగా ఉంటే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తారు. వడగాడ్పులు ఉన్నప్పుడు వేసవి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింద

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *