Thursday, 5 November 2026

ఉదారతను చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఉదారతను చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
— మృతురాలి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం
మోత్కూరు డిసెంబర్ 16 జనంసాక్షి : అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన రాజోజు నాగమణి ఇటీవలే ఆత్మహత్య చేసుకొని మరణించగా దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని తన అభిమానుల ద్వారా తెలుసుకున్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బాధితురాలి కుటుంబ సభ్యులతో గురువారం ఆయన ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. నాగమణి కుటుంబానికి తన వంతుగా రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అభిమానుల ద్వారా అందజేశారు. నాగమణి పిల్లలు (ఇద్దరు కూతుళ్లు, కుమారుణ్ణి) చదివించి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి సందీప్ రెడ్డి, ఇటికాల చిరంజీవి, మారిశెట్టి మల్లేష్, ఎండి షకిల్, చిప్పలపల్లి బాలు, పరశురాములు, బొమ్మగాని లక్ష్మయ్య, సైదులు, లింగాల నర్సిరెడ్డి, బోడ యాదగిరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.