11వ రోజుకు చేరుకున్న బిజెపి పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం.
కోటగిరి డిసెంబర్ 16 జనం సాక్షి:-స్పీకర్ వెంట తిరిగినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోదు,
గ్రామాలలో ప్రతి వాడవాడన తిరిగితే అభివృద్ధి జరిగిందో లేదో అని తెలుస్తుందని బాన్సువాడ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ మాల్యాద్రి రెడ్డి,భారాస నాయకులకు ఎద్దేవా చేశారు. బాన్సువాడ నియోజకవర్గ బిజెపి పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో భాగంగా శుక్రవారం రోజున ఉమ్మడి కోటగిరి మండలంలోని సుంకిని, కొల్లూరు,రామ్ గంగానగర్,సోంపూర్,టాక్లి, వల్లబాపూర్,దోమలేడ్గి గ్రామాలలో ఆయన కార్యకర్తలు కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన కార్యకర్తల ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు.అనంతరం ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పేదలందరికీ అభివృద్ధి ప్రదాత అని చెప్పుకోవడం తప్పితే నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యమే అని పోచారంకి ఆయన పరోక్ష విమర్శలు చేశారు.దోమలేడ్గి గ్రామానికి చెందిన భారతి బాయ్ అనే వితంతు మహిళా ఇల్లు లేక పెన్షన్ రాక రేషన్ కార్డు లేక ఎంతలా అవస్థ పడుతుందో పోచారం 30 ఏళ్ల దౌర్జన్య పాలన,వారి అనుచరుల దుస్సాహంకు అద్దం పడుతుందని అన్నారు. బాన్సువాడ నీ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులు ఉద్యమిస్తే,బిఅర్ఎస్ నాయకులు మాత్రం బాన్సువాడ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది జిల్లా కేంద్రం ఎందుకని మాట్లాడటం సిగ్గుచేటన్నారు.అభివృద్ధి అనేది స్పీకర్ వెంట కార్లలో తిరుగుతే కనిపించదు గ్రామాలలో ప్రతి వాడవాడన తిరిగితే అభివృద్ధి జరిగిందా లేదా అనేది తెలుస్తుందని బిఅర్ఎస్ నాయకులకు ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో కోటగిరి మండలం బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కాపుగాండ్ల శ్రీనివాస్, బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్ కొత్త కొండ ప్రభాకర్, గురునాథ్,సూర్యకాంత్ సతీష్ మహారాజ్,బజరంగ్, రాజా గౌడ్,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




