Thursday, 5 November 2026

ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి

ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి.

జిల్లా అధ్యక్షులు కుసుమ విష్ణు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 11. (జనంసాక్షి). తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాల్సిందిగా జిల్లా అధ్యక్షులు కుసుమ విష్ణు కోరారు. శుక్రవారం ఆత్మగౌరవ సభ ప్రచార కరపత్రలాను విడుదల చేశారు. ఈ సందర్భంగా కుసుమ విష్ణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి ఆదరించవలసి ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం నవంబర్ 27న సిరిసిల్లలో జరిగే ఆత్మగౌరవ సభకు భారీ సంఖ్యలో ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమకారుల డిమాండ్ల సాధన కోసం పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుంటుక మహేష్, పట్టణ అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్, చీకోటి అనిల్, కొమ్మరాజుల ఐలయ్య, దేవరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.

.