కాశీబుగ్గ, వరంగల్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముందస్తు అరెస్టులకు పాల్పడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని తెరాస నేత కడియం శ్రీహరి అరోపించారు. హన్మకొండలోని తెరాస జిల్లా కార్యాలయంలో కడియం మీడియాతో మాట్లాడారు. సీఎం నల్ల చట్టాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలమని చెప్తున్న కాంగ్రెస్, తెదేపాలు అసెంబ్లీలో తీర్మానానికి ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ఎంత మందిని అరెస్టు చేసినా 14న జరిగే చలో అసెంబ్లీని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.




