Wednesday, 4 November 2026

ఉద్యమ కార్యచరణ ప్రకటించిన టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌రావు మరోసారి తెలంగాణ ఉద్యమ సమర శంఖం పూరించారు. మరో దఫా ఉద్యమానికి గులాబీ దండు సమాయత్తం కావాలని గులాబీ బాస్‌ పిలుపునిచ్చారు. ఇవాళ జరిగిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సులో టీఆర్‌ఎస్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 29 ‘ దీక్ష దివాన్‌ ‘ పేరిట తెలంగాణ వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని తెలంగాణ వాదులకు  పిలుపునిచ్చారు.23న సూర్యపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. నవంబర్‌ 30 నుంచి ‘ పల్లెబాట ‘ కార్యక్రమం చేపట్టనున్నట్లు కేసీఆర్‌  ప్రకటించారు. ఈ పల్లెబాట కార్యక్రమం నలబై రోజులపాటు కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. కాగా, జేఏసీతో ఏర్పడిన చిన్నచిన్న పొరపొచ్చాలను త్వరలోనే పరిష్కరించుకుంటామని కేసీఆర్‌ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *