హైదరాబాద్ : ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన గురువారమిక్కడ డిమాండ్ చేశారు. చిన్న కాంట్రాక్టులు కూడా బడా బాబులకే ఇస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చేందుకు ఉద్యమాలు చేస్తామని కోదండరామ్ స్పష్టం చేశారు.
‘ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలి’




