Monday, 2 November 2026

200 కిలోల గంజాయి స్వాధీనం

రోలుగుంట(విశాఖపట్నం) : అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా రోలుగుంటలో గురువారం చోటుచేసుకుంది. మన్యం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలించడానికి యత్నిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *