Wednesday, 4 November 2026

ఉద్యోగులకు 2.73 శాతం డీఏ

17.29 నుంచి 20.02 శాతానికి పెంపు
2021 జూలై నుంచి 2022 డిసెంబర్‌ వరకు జీపీఎఫ్‌లో ఖాతా ఉన్నవారికి ఎరియర్స్‌ జమ
ఖాతా లేనివారికి 10% ప్రాన్‌ అకౌంట్‌లో..మిగిలిన 90% బకాయిలు 8 విడతలుగా నగదు
పెన్షనర్లకూ వర్తింపు.. 7 లక్షల మందికిపైగా లబ్ధి
మంత్రి హరీశ్‌రావు వెల్లడి.. జీవోలు జారీ
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హర్షం
హైదరాబాద్‌: కరువు భత్యం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చే రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా వాయిదాపడిన డీఏ బకాయిలను చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే జీవోలు జారీచేసింది. మూలవేతనంపై 17.29 శాతం ఉన్న డీఏను 20.02 శాతానికి పెంచింది.మొత్తం 18 నెలల బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో జమచేయనున్నది. ఈ నెల నుంచి నేరుగా వారి వేతనాలతో కలిపి పెంచిన డీఏను అందించనున్నది. సీపీఎస్‌ ఉద్యోగులకు 10% ప్రాన్‌ అకౌంట్‌లో, మిగిలిన మొత్తం 8 విడతలలో నగదుగా అందించనున్నది