జనంసాక్షి, కమాన్ పూర్ : మంథని నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నేతృత్వంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చొరవతో జరిగిన అభివృధ్దిని ప్రజలు ఆదరిస్తుంటే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని కమాన్‌పూర్ మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన యాదగిరి పద్మ కు రూ.18 వేలు, గోస్కుల అఖిలకు రూ.12 వేలు, గరిగంటి బాలయ్యకు రూ.12 వేలు ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరీ కాగా ఆ చెక్కులను జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తమ ఉనికి కోసమే కాంగ్రెస్ నాయకులు ఆరాటపడుతూ జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ గారిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును విమర్శిస్తున్నారని అన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పరిపాలనతో చేసిన అభివృధ్దికి ప్రజలకు చెప్పాలనే ఆలోచనతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుంటే దానిని తప్పు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఏండ్ల తరబడి అధికారంలో ఉండి చెప్పుకునేందుకు ఏ అభివృధ్ది పని లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు దిక్కు తోచని స్థితిలో దిష్టిబొమ్మల దహనం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కమాన్‌పూర్ మండల ప్రజలు తమ ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచి మండలానికి ఏం అభివృధ్ది చేశారో కాంగ్రెస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. నాలుగేండ్ల కాలంలో ప్రస్తుత ఎమ్మెల్యే రూ.50 లక్షల నిధులు ఇచ్చి మండలానికి ఏదో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు నిలబెట్టుకోవడం కాంగ్రెస్ నాయకులు విఫలం అయ్యారని, తమ నాయకుడు మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక అభివృధ్ది పనులు చేశారని వివరించారు. జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చొరవతోనే కమాన్‌పూర్ మండల అభివృధ్ది సాధ్యమైందని, మండలంలోని అనేక గ్రామాలకు సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాల నిర్మించిన ఘనత జెడ్పీ చైర్మన్‌కే దక్కిందన్నారు. అభివృధ్ది గురించి ఆలోచన చేసే నాయకుడిని విమర్శిస్తే ప్రజలు సహించరని ఆయన హితవు పలికారు. అంతేకాకుండా నియోజకవర్గ పేద ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్ పథకాన్ని అందించిన చరిత్ర కూడా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌దేనని, ఎంతో మంది పేదవారికి కార్పోరేట్ వైద్యం అందించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా ఆర్థికసాయం అందించారని ఆయన గుర్తు చేశారు. అభివృధ్ది, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం, జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ముందుకు సాగుతున్నారని, ప్రభుత్వాన్ని, జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ని విమర్శిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ – రవి, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, గుండారం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దండే కిషన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల గట్టయ్య, దండే కనకరత్నం, బొల్లపల్లి శంకర్ గౌడ్, పిట్టల స్వామి, మల్యాల భాస్కర్, సింగం శ్రీనివాస్, ఆవునూరి మల్లేష్, గోస్కుల మధు, బోనగాని సంతోష్, గుర్రాల శంకర్, కీర్తి శ్రీనివాస్, కనుకయ్య, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఉనికి కోసమే కాంగ్రెస్ నాయకుల ఆరాటం – జడ్పీ చైర్మన్ పుట్ట మధు చొరవతోనే కమాన్‌పూర్ అభివృధ్ది – బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్ రెడ్డి




