భైంసా రూరల్ మే 31జనం సాక్షినిర్మల్ జిల్లా ,,భైంసా… విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని అనసూయ పవర్ ట్రస్ట్ చైర్మన్ పవర్ రామారావు పటేల్ అన్నారు. ఎస్ ఎస్జిన్నింగ్ఫ్యాక్టరీలోనియోజకవర్గంలోని పలు పాఠశాలలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు టెన్ బై టెన్ జిపిఎస్ సాధించిన సందర్భంగా వారిని సత్కరించి అభినందించారు. 51 మంది విద్యార్థులకు మెమొంటోను, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. చదువుతోనే అనుకున్నది సాధించగలుగుతామన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు తాపత్రయపడే తీరును ఆయన విద్యార్థులకు చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగిన తల్లిదండ్రులను మరవకూడదు అన్నారు. నియోజకవర్గంలో ఎన్నడు లేని విధంగా విద్యార్థులు 10/10 జీపీఏ సాధించడంశుభ పరిణామం అన్నారు . అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మండల విద్యాధికారి సుభాష్, పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారావు మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులుగంగాధర్,శ్రీనివాస్, వందనతోపాటు వేదం పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అనసూయ పవర్ ట్రస్ట్ చైర్మన్ రామారావు పటేల్




