హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలను వెల్లడించడానికి సిటీ సివిల్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా, కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థాననంలో సవాలు చేయనున్నట్టు పిటిషనర్, నటుడు ఓ.కళ్యాణ్ స్పష్టం చేశారు. మా ఎన్నికల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడం లేదంటూ కళ్యాణ్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణ జరిపి దానిని కొట్టి వేసింది.




