ఉపాధి కూలీలు జాబ్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి
రాజంపేట్ డిసెంబర్ 30 (జనంసాక్షి)
రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్న వారు తప్పనిసరి జాబ్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవాలని మండల అధికారి ఎంపిఓ ప్రవీణ్ శుక్రవారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాబ్ కార్డు కలిగిన పత్తి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలని జాబ్ కార్డులు కలిగి ఉన్న వారు తప్పకుండా తమ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని సూచించారు అదేవిధంగా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాక్సిన్ పై చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు




