నూతన సంవత్సర వేడుకలు నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలి
రాజంపేట్ డిసెంబర్ 30 (జనంసాక్షి)
రాజంపేట్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం వేడుకలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని రాజంపేట్ ఎస్సై రాజు అన్నారు చిన్న వయసులో మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని పేర్కొన్నారు అతివేగంగా జాగ్రత్తగా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని తెలిపారు అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దు కుటుంబానికి బాధ ను మిగిలిన వద్దని అన్నారు నిబంధనలను పాటిస్తూ నూతన సంవత్సరం వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని స్థానిక ఎస్సై రాజు సూచించారు




