హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధి హామి కార్యక్రమాన్ని స్వచ్చంద సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కొత్త కార్యచరణ చేపట్టనుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమం అమలులో దేశంలోనే అగ్రగామిగా ఉన్న రాష్ట్రంలో మరో అడుగు ముందుకేసి ఎన్జీవోలకు మరిన్ని అదనపు బాధ్యతలను అప్పగించనుంది. ఇందుకోసం ఈ నెల 26న కార్యక్రమం అమలవుతున్న 22 జిల్లాల నుంచి 105 కు పైగా ఎన్జీవోల ప్రతినిధులను ఆహ్వానించి ఇక్కడ అమలవుతుతున్న ఉపాధి హామి పనులలో కొత్త అంశాలపై వారికి అవగాహన కల్పించనున్నారు.




