హైదరాబాద్ : బంగారం కొనేటప్పుడు ధరతోపాటు నాణ్యత ,తూకాలు జాగ్రత్తగా చూసుకోవాలని తూనికలు, కొలతల శాఖ వారు చెబుతున్నారు. విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలు కొనేటప్పుడు వాటి బరువును తీసివేస్తున్నారో లేదో చూడాలని లేక పోతే మొదటికే మోసం వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. బంగారం ధరలు తగ్గాయి. కదా అని చాలా మంది నగల దుకాణాలకు వెళ్లి హడావిడిగా కొనేస్తున్నారు. కొనే ముందు ఒక్క నిమిషం ఆలోచించమని తూనికలు, కొలతల శాఖ అధికారులు సలహ ఇస్తున్నారు.




