
రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవంతం చేయాలి..
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్..
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 23
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పనులు కల్పించాలని, డిమాండ్ చేస్తూ, మార్చి 26,27,కరీంనగర్ లో జరిగే రాష్ట్ర విస్తృత కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బోయిని అశోక్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి, జిల్లా సంఘం సహాయ కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో కరపత్రాలను అశోక్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వ హయంలో పోరాడి సాధించుకున్న, ఈ చట్టం 18 సంవత్సరాల నుండి అమలవుతుంది. ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న కూలీలకు 200 రోజులు రోజుకు 600 రూపాయల వేతనం చెల్లించాలన్నారు, పీల్డ్ అసిస్టెంట్ లకు ఉద్యోగ భద్రత కల్పించి వారు రెగ్యులరైజ్ చేయాలన్నారు. పేదలకు కడుపు నింపే ఉపాధి హామీ చట్టాన్ని కూలీలకు దూరం చేసే కేంద్ర ప్రభుత్వ పుట్లను, కార్మిక వ్యతిరేక విధానాలు ఎండగట్టేందుకు ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం, వ్యవసాయ కూలీలకు, ఉపాధి కూలీలకు, ఇండ్లు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులో సాధన కోసం ఉపాధి హామీ కూలీల ఐక్యం చేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించుతున్నాం. ఈ నేపథ్యంలో ఈనెల మార్చి 26, 27 తేదీలలో రోజులపాటు కరీంనగర్ లో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని, అత్యధికంగా సదస్సుకు కార్మికులు, కర్షకులు హాజరై విజయవంతం చేయాలని, అశోక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల సమ్మయ్య, ఏఐటీయుసి, నాయకులు కనకం కుమార్, మేకల రవీందర్, కనుకo స్వామి, రాయ మల్లు, వెంకటేష్, శ్రీనివాస్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీకులకు 200 రోజులు పని కల్పించాలి..




