Thursday, 5 November 2026

ఘనంగా ముద్దసాని జయంతి వేడుకలు..

శంకరపట్నం: జనం సాక్షి మార్చి 23
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , కరీంనగర్ జిల్లా కమలాపూర్ శాసనసభ్యులు రాష్ట్ర మాజీ మంత్రి దివంగత నేత ముద్దసాని దామోదర్ రెడ్డి జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ జిల్లా , మానకొండూర్ నియోజకవర్గం లోని, శంకరపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అరిఫ్ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో కమలాపూర్ నియోజకవర్గం నుండి గెలుపొందిన కీర్తిశేషులు దివంగత మాజీ మంత్రి ముద్ధసాని దామోదర్ రెడ్డి జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి, పండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు, అంబాలాపూర్ మాజీ సర్పంచ్ రహీం, నాయకులు గోపు వీరమల్లు, సమ్మయ్య, సాబీర్, పాటు తదితరులు పాల్గొన్నారు.