ఎం పి డి ఓ సురేందర్ నాయక్ఉపాధి హామీ కూలీలు పని కోసం దరఖాస్తు చేసుకోవాలి ఎం పి డి ఓ సురేందర్ నాయక్కొడకండ్ల, ఏప్రిల్03(జనం సాక్షి ) కొడకండ్ల గ్రామంలో ఉపాధి హామీ పని విసిట్ చేసి మాస్టర్ వెరిఫికేషన్ చేసిన ఎంపీడీవో సురేందర్ నాయక్. అనంతరం మాట్లాడుతూ అన్ని గ్రామాలలో ఉపాధి కూలీలు పని కోసం దరఖాస్తులు చేసుకోవాలని, అన్ని గ్రామాలలో అధిక సంఖ్యలో కూలీలు పని చేసే విధంగా సిబ్బంది అందరూ మోటివేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. వర్క్ సైట్ లో కనీసం ఐదు గంటలు పని చేస్తే 279 రూపాయలు పడే అవకాశం ఉంటుంది వర్క్ సైట్ లో ఉదయం 7 గంటల నుండి మద్యాహ్నం 12 గంటలకు పని చేస్తున్న కూలీల ఫోటో జిపిఎస్ ద్వారా సెంట్రల్ సర్వర్ కు అప్లోడ్ చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు సూచించారు.అప్లోడ్ చేయని యెడల పేమెంట్లు కావు కావున అందరూ సక్రమంగా పని చేయాలని ఆధార , బ్యాంకు అకౌంట్ ఎన్రోల్మెంట్ చేసిన కూలీలు మాత్రమే పనికి డిమాండ్ తీసుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాలలో ఎక్కువ మంది పని చేస్తే నే 60, 40 రేషియోలో భాగంగా సిసి రోడ్లు, గ్రామపంచాయతీ బిల్డింగ్స్ పేమెంట్స్, మెటీరియల్ పేమెంట్ లో అవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం పి ఓ శ్రీనివాస్,ఏ పి ఓ నరిగే కుమారస్వామి గౌడ్, టెక్నికల్ అసిస్టెంట్ యాకయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ జంగిలి సురేష్, ఉపాధి మెట్లు, కూలీలు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీలు పని కోసం దరఖాస్తు చేసుకోవాలి




