జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్ల మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేసిన పనులకు నెల రోజులుగా బిల్లు లు రాకపోవడంతో ఇక్కడి పేద ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. నెలల తరబడి ఉపాధి హామీ పనుల బిల్లులు పెండింగ్లో ఉంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రోజులవారిగా పే స్లిప్పులు ఇవ్వటం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీరం చేస్తూ పేదవాడికి అందకుండా చేస్తుందని విమర్శించారు. పని దినాలను 200 రోజులకు పెంచి రోజుకు వేతనం 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉపాధి కూలీలతో ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు మంథని వెంకటి రామగుండం మల్లయ్య రవీందర్ శంకర్ రాజమ్మ శంకరమ్మ తదితరులు ఉన్నారు.




