Tuesday, 3 November 2026

7వ రోజు కొనసాగుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె కు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి. కృష్ణారావు

 

 

 

 

మెట్పల్లి టౌన్, మే 04, జనంసాక్షి :జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ ఆవరణలో ఏడవ రోజు కొనసాగుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఈ సందర్భంగా వారి సమస్యలపై, వాళ్లకి జరిగే అన్యాయాలపై, పలు అంశాలపై మాట్లాడుతూ వాళ్లకి కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి అండ దండలు సహకారం ఉంటుందని తెలిపారు. కోవిడ్ సమయంలో చేసిన సేవలకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టిన కానీ, మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇలా దిక్కు తోచని పరిస్థితిలోకి తేవడం దౌర్భాగ్యం అని సంఘీభావం తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సేవలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కోరుకుంటుందని మీయొక్క సేవలు గ్రామాల అభివృద్ధికి నిదర్శనంగా నిలిచాయని కృష్ణరావు పంచాయతీ కార్యదర్శులకు మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు అందే మారుతి బాపూజీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, మెటుపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇళ్లేందుల రాజు, పార్టీ సీనియర్ నాయకులు డా. బెజ్జారపు శ్రీనివాస్, న్యాయవాదులు, పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ హఫీజ్, కొమిరెడ్డి లింగారెడ్డి, ఇబ్రహీంపట్నం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోటగిరి చైతన్య, చెన్నూరి శివకుమార్, సంగెం సాగర్, తదితరులు పాల్గొన్నారు