ఉపాధ్యాయుల పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి…. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెంగర్తి ప్రణీత్, రాజగోపాల్ గౌడ్ …

చిలప్ చేడ్/ఆగస్టు/జనంసాక్షి :- చిలప్ చేడ్ మండల యస్ టీ యూ సభ్యత్వ నమోదు కార్యక్రమములో భాగంగా బుధవారం నాడు మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదు చేసారు, తధనంతరం చిలప్ చేడ్ మండల యస్ టీ యూ నూతన కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు. అధ్యక్షునిగా వెంకట కృష్ణ అజ్జమర్రి , ప్రధాన కార్యదర్శిగా పెద్ద గొల్ల మహేష్ కుమార్ శీలాంపల్లి, జిల్లా కౌన్సిలర్ గా నరేష్ సైదన్నగారి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతు సి పి యస్ ని రద్దు చేసి పాత పెన్షన్ ని పునరుద్దరించాలని డిమాండ్ చేసారు.. అదే విదంగా పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు యస్టీయూ సంఘం ఉపాధ్యాయుల సమస్యల ను తీర్చడంలో ముందు ఉంటుందని సూచించారు కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర రాజు, ఎల్లం సతీష్,బాల మల్లేష్, కనకయ్య,మదర్,లు పాల్గొన్నారు.