అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. ప్రాథమిక పాఠశాలలో నేడు రక్షా బంధన్ వేడుకలు.
జనం సాక్షి/సైదాపూర్ ఆగస్టు 30. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న మాసం శ్రావణం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజును పరమ పవిత్రంగా భావిస్తారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం, అనురాగానికి ప్రతిరూపమైన రక్షాబంధన్‌ను కులమతాలకతీతంగా జరుపుకొంటారు. ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలు కట్టి, ఆశీర్వాదం పొందడంతో పాటు కానుకులను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైడిమల్ల సుశీల తిరుపతి గౌడ్,ప్రధానోపాధ్యాయులు అమరేందర్ రెడ్డి,ఉపాధ్యాయులు శ్రీనివాస్,శ్రీధర్,విద్యార్థులు జ్ఞాన సింధు, ప్రణయశ్రీ,రోషిని తదితరులు పాల్గొన్నారు.